Return to BahaiPrayers.net
Facebook
ఆయన పరమపావనుడు, మహామహిమాన్వితుడు.
అనుకంపాన్వితుడును, కరుణాన్వితుడునునగు భగవంతుని పేరిట! సకలలోకాధీశుడగు భగవంతుడు ప్రకీర్తితుడు!
ఓ ప్రభూ, నా దేవా, నా ఆశ్రయణమా, నా శరణ్యమా! ఓ సర్వశక్తిశాలీ, క్షమాశీలీ, నీ సర్వశక్తి చిహ్నములయం దొక్క దానినైనను సంకీర్తించుటకేని, నీచే సృజితమైన దివ్యవాక్కు నొక్కదానిని ప్రస్తుతించుటకేని గావించు యత్నమున వాగ్ధారాన్వితవక్త జిహ్వ తడవడునని, మానుషలేఖిని దైనను, జిహ్వదైనను ప్రతి వ్యక్తీకరణయు కలవరపాటునకు లోనగునని యెఱిగియు, అద్భుత శ్లాఘాన్వితోక్తులతోనైనను, మహాశబ్దచాతురీయుత సంస్తవగీతికలతోనైనను సముచితముగ ని న్నెటుల ప్రస్తుతింప జాలుదును. నీ దివ్యపావిత్య్రత కెగయు ప్రయత్నమున మానవమేధో విహంగముల పక్షములు భగ్నములైనవి, తదీయ జ్ఞానమండపపు సర్వోత్కృష్టశిఖరములపై సున్నితములైన తమ గూళ్ల నల్లుటకు వ్యర్ధోహాశాలికలు శక్తిహీనములు. నా శక్తిహైన్యతను, లోపము లను అంగీకరించుట వినా అన్యధా నాకిక శరణము లేదు, అభాగ్య, అభావముల యగాధముల యందున దక్క నా కావాసమూ లేదు. నిక్కముగా, నిను గ్రహియింప శక్తిహైన్యతయే అవగాహనా తత్త్వము, దోషముల నొప్పుకొనుటయే నీ సాన్నిధ్యసాధనకు యేకైక మార్గము, లేమి నంగీకరించు టయే నిజైశ్వర్య మూలము.
ఓ ప్రభూ! నీ మహోన్నత సింహద్వార సంసేవనమున నాకునూ, నీ విధేయసేవకులకునూ కృపతో సహకరింపుము; నీ దివ్య పావనతా ప్రార్థనముతో మమ్ము సశక్తీకరింపుము, నీ ఏకేశ్వరత్వ ద్వారము యెదుట వినయవిధేయతలతో మమ్ములను మననిమ్ము. ఓ నా ప్రభూ, నా యడుగు లను నీ పథమున స్థిరీకరించి, నీ మహిమా స్వర్గశోభిత జ్యోతిర్మయ మయూఖములతో నా మనస్సు నుద్దీపిత మొనరింపుము. నీ క్షమాసహిష్ణుతల స్వర్గవ్యాపిత చైతన్యానిలముతో నా యంతరంగము నుత్తేజిత మొనరింపుము, నీ పవిత్రతా వైుదాన పరివ్యాపిత పునరుజ్జీవన పవనముతో నా యాత్మను సంతసిల్ల జేయుము. నీ యేకత్వ దిఙ్మండలముపై నా వదనమును శోభిల్లజేసి, నన్ను నీ విధేయసేవకుల యందున గణియింపుము, నీ నిష్ఠాగరిష్ఠ దాసుల యందున పరిగణన మొనరింపుము.
------------------
వ్యర్థాలోచనలనే సాలీళ్ళు
- `Abdu'l-Bahá