Return   Facebook   Zip File   Selections from the Writings of Bahá’u’lláh for Bahá’í Holy Days

The observance of holy days occupies a central place in every religion. Through their commemoration, the calendar year becomes the stage on which the signal events associated with the life and ministry of the divine Manifestations of God are annually remembered and honoured. This remembrance has both a personal dimension, providing a time for reflection on the significance of these events, and a social dimension, helping to deepen the identity and foster the cohesion of the community.

The coming of each Manifestation of God brings renewal and revitalization: “old things are passed away” and “all things are become new”.[1] By His authority, former laws are abrogated and the manners and customs of the previous Dispensation are reformed. Through the creative power of Divine Revelation, fresh life is instilled into hearts and souls:

Reflect thou, how, in one hand, He hath, by His mighty grasp, turned the earth of knowledge and understanding, previously unfolded, into a mere handful, and, on the other, spread out a new and highly exalted earth in the hearts of men, thus causing the freshest and loveliest blossoms, and the mightiest and loftiest trees to spring forth from the illumined bosom of man.[2]

This re-creation and revitalization of all things is reflected in the introduction of a new calendar and the designation of new holy days which recast the rhythms of communal life.

The Bahá’í calendar, known as the Badí‘ calendar, was introduced by the Báb and subsequently confirmed by Bahá’u’lláh, Who fixed its commencement at the year of the Báb’s declaration, 1844 (A.H. 1260). As the Bahá’í Era was inaugurated by twin Founders, the Bahá’í Holy Days include events pertaining to the birth, declaration, and passing of both Bahá’u’lláh and the Báb. In the Kitáb-i-Aqdas, the principal repository of the laws of His Revelation, Bahá’u’lláh designates the two “Most Great Festivals”: Riḍván, “the King of Festivals”, commemorating the declaration of His prophetic mission during a period of twelve days, three of which are observed as Holy Days, and the Declaration of the Báb, the event that initiates the Bahá’í Era. Also named as festivals in that same Book are Naw-Rúz and the anniversaries of the Birth of the Báb and of Bahá’u’lláh. The anniversary of the Martyrdom of the Báb was commemorated as a Holy Day during the lifetime of Bahá’u’lláh, and ‘Abdu’l-Bahá added the observance of the Ascension of Bahá’u’lláh.

The present volume offers forty-five selections from the Writings of Bahá’u’lláh revealed specifically for, or otherwise relating to, these nine Holy Days. The selections represent different revelatory modes, each reflecting facets of the greatness, the preciousness, and the peerless nature of this Day in which all the promises and prophecies of the past have been fulfilled—this sacred Day “whereon God hath made His own Self known and revealed it unto all who are in the heavens and on earth”. Some of the Tablets and excerpts presented in the volume are addressed to the body of Bahá’u’lláh’s followers and are expressed in a celebratory and uplifting tone, occasionally with repeated refrains, while others were revealed to individual believers, sometimes with a mention of the specific circumstances of their revelation or the names of the recipients. Many are among His best-known works and have long been familiar to readers of His Writings in the original languages.

Eight of the selections were previously translated by Shoghi Effendi and published in Prayers and Meditations by Bahá’u’lláh and Gleanings from the Writings of Bahá’u’lláh. A table listing these and other passages translated by Shoghi Effendi can be found at the end of the book. The remainder of the selections are, for the most part, published here for the first time in English. The current translations endeavour to afford a glimpse of the poetic tone of these celebrated Texts, even though they can never convey their full beauty.

It is hoped that this volume will uplift the hearts and souls of the followers of the Blessed Beauty throughout the world and will enrich the gatherings they hold in commemoration of those days that stand apart from all other days through their association with Him and His Herald.

Naw-Rúz

“నేను పరమపావనుడను, పరమోత్కృష్టుడను, మహాయశస్విని. ”

ఓ నా దేవా, ఈ దినమును నీ సేవకులయందలి అభిమానపాత్రులకు, నీ ఇష్టుల యందలి నిష్ఠాపరులకు ఉత్సవముగ నిర్దేశించినందులకు నీవు ప్రకీర్తితుడవు. ఏ దివ్యనామముతో సృజిత వస్తుసమస్తము జయింపబడినదో, నీ దివ్యావిష్కరణా మలయ పవనములు భువికిని, దివికిని మధ్య వ్యాప్తితములైనవో, నీ పవిత్ర గ్రంథముల యందునను, దివ్యలేఖనముల యందునను లిఖియింపబడినదెల్లయు ఏ దివ్యనామముచే అభివ్యక్తమైనదో, నిన్ను వీక్షించుటకును, నీ పునఃసమాగమ సాగరము నాశ్రయించుటకును, నీ సింహాసనపీఠికా సముఖమున నిలుచుటకును, నీ యదృశ్యస్వరూప ప్రత్యూషము నుండియు నీ దివ్యతత్త్వసార ప్రభాతస్థలి నుండియు నీ మహాద్భుతాహ్వానము నాలించుటకును, సమస్త మానవులును సంసిద్ధులు గావింపబడవలెనని నీ సందేశహరులు, నీవెంచుకొనిన వారలు పూర్వసమాచారము నందుకొనిరో - ఆ దివ్యనామముతో నీవీ పర్వదినమును వ్యవహరించినాడవు.

ఓ ప్రభూ నా దేవా, నీవు నీ ప్రకటనమును గావించి, నీ యుపకృతిని పరిపూర్ణము గావించి, నీ ఏకత్వమును, నీ ఐక్యతను ఉద్ఘోషించినయట్టి “ఆయన” ను దివ్యావిష్కరణాసనముపై అధిష్ఠింపచేసి, “ఆయన” సముఖమునకు రమ్మని సమస్త ప్రజానీకమునూ ఆదేశించినందులకు నీకు ప్రణతుల నర్పింపుచున్నాడను. ఆయన నాశ్రయించి, ఆయన సాన్నిధ్యమునొంది, ఆయన దివ్యావిష్కరణ యను యిష్టమధువును గ్రోలిన వారు ఆ ప్రజానీకము నందున్నారు. నీ యిష్టులను నీతో దక్క అన్యమంతటితోడను తెగత్రెంపులు చేసికొనునటుల, నీ యనుగ్రహ దిఙ్మండముపై తమ దృష్టిని నిలుపునటుల చేయుమని సకల వస్తుసంచయాధికారము గల నీ సార్వభౌమత్వశక్తి పేరిట, సమస్తసృష్టిని ఆవరించిన నీ యనుగ్రహము పేరిట నిన్నర్ధింపుచున్నాడను. వారికి, యిక, నిన్ను సేవించుట కుద్యమించునటుల సాహాయ్యము నొనరింపుము. తద్వారా, వారు నీ దివ్యధామమున నీవభిలషించిన దానిని ప్రదర్శించి నీ భూభాగముపై విజయధ్వజపతాకములను వివృత మొనరింతురు గాక. నిక్కముగ నీవు సమస్తశక్తియుతుడవు, సర్వవిజ్ఞానివి, సకలవివేకివి.

ఓ ప్రభూ నా దేవా, నీవీ కారాగారమును సామ్రాజ్య సింహాసనముగ, నీ స్వర్గములకు స్వర్గముగ, నీ ప్రత్యూషములకు ప్రత్యూషముగ, నీ ప్రభాతములకు ప్రభాతస్థలిగా, నీ యనుగ్రహ జలధరములకు మూలముగ, నీ ప్రాణులసంచయములకు జీవస్ఫూర్తిగ కావించినందులకు నీకు ప్రణతుల నర్పింపుచున్నాడను. నీవెంచుకొనిన వారికి నీ యభిప్రీతికి అనుగుణముగ వర్తించునటుల సాహాయ్యము నొనరింపుమని నిన్ను అర్ధింపుచున్నాడను. ఓ ప్రభూ, ఇక, నీ జీవితకాలమున వారి ధారితవస్త్రముల యంచును మలినము గావించుదానినుండి వారిని క్షాళనమొనరింపుము. ఓ ప్రభూ, భూభాగములు కొన్నింటి యందున నీ యిచ్ఛావిరుద్ధముగ జరుగుచున్న దానిని నీవు అవలోకింపుచున్నావు. నిన్ను అభిమానింపుచుంటిమని చెప్పుకొనుచు, శాత్రవులొనరించిన కృత్యములకే పాల్పడినవారిని విలోకింపుచున్నాడవు. ఓ ప్రభూ, వారిని - నీ జనుల యందలి అత్యభిమానపాత్రులను, నీ సేవకుల యందలి నిష్ఠాపరులను, నీవు పవిత్రీకరించియున్నయట్టి జీవజ్జలములతో ప్రక్షాళన గావింపుము. నీ భూభాగములయందున నీ దివ్యహేతువుకు గల సత్కీర్తికి కళంకమును తెచ్చుటయో, నీ నగరస్థిత ప్రజావళిని నిన్ను గుర్తింపనీయక ప్రతిరోధించుటయో చేయు దానినుండి - వారిని విముక్తుల నొనరింపుము.

ఓ ప్రభూ, స్వార్ధమోహముల పథము ననుసరింపనీయక వారిని కాపాడుమని, తద్వారా నీవు నీ గ్రంథమునం దాదేశించిన దానిని ఎల్లరును పరివేష్టింతురని, సమస్త నామములకన్నను శ్రేష్ఠతమమగు నీ దివ్యనామము పేరిట నిన్ను ప్రార్ధింపుచున్నాడను. వారిని యిక, నీ దివ్యధర్మమునకు హస్తములను గావింపుము, అవ్విధముగ, వారి మూలమున నీ భువియం దంతటను నీ పవిత్ర ప్రవచనములు సువిస్తృతముగ విస్తరిల్లి, నీ దివ్యత్వ ప్రతీకలు నీ జనబాహుళ్యమధ్యమున ప్రదర్శితములు కావచ్చును. నీవు నీ యిచ్ఛానుసారము వర్తింప శక్తుడవు. ఆపదోద్ధారకుడవును, స్వయంజీవనుడవును నగు నీవు తప్ప అన్యదైవము లేడు.

Naw-Rúz

ఓ నా దేవా, నీ మీది ప్రేమ చేత ఉపవాసాన్ని పాటించిన వారికి, నీకు అసహ్యకరమైన సమస్తం నుంచి దూరులయిన వారికి నౌరూజ్ ఉత్సవము అని ఆజ్ఞాపించిన నీవు ప్రశస్తుడవు అవుదువుగాక! నీ ప్రేమాగ్ని, నీతో నియోజితమయిన ఉపవాసము వల్ల ఉద్భవించిన ఉష్ణిమ వారిని నీ హేతు విషయంలో ఉజ్జ్వలితులను చేయటాన్ని, ఓ నా ప్రభూ! వారికి అనుగ్రహించు. వారిని నీ ప్రశస్తితోనూ, నీ జ్ఞప్తితోనూ వ్యాపృతులను గావించు.

ఓ నా ప్రభూ, నీవు వారిని ఉపవాసానికి నీ చేత నిర్ణయింపబడ్డ అలంకరణలతో అలంకరించావు గనుక నీవు నీ ఔదార్యవదాన్యతానుగ్రహాలతో నీ అంగీకరణ అలంకరణతో సైతం వారిని అలంకరించు. మానవుల చర్యలన్నీ నీ ఉన్నతానందం మీద ఆధారపడ్డవి; నీ ఆనతి మీద నియమింపబడ్డవి. నీవు ఎవడు ఉపవాసాన్ని భగ్నపరిచాడో అతడిని దానిని పాటించినవాడినిగా పరిగణించవలె; అట్టివాడు, ఎవరైతే నిత్యత్వం నుంచి ఉపవాసాన్ని అనుసరిస్తున్నారో ఆ వారిలోనివాడుగా పరిగణింపబడతాడు. నీవు, ఉపవాసాన్ని పాటించేవాడు ఎవడైనా దానిని భంగపరచినట్లు నిర్ణయిస్తే ఆ వ్యక్తి నీ ఆవిష్కరణ సీవిత వసనాన్ని ధూళితో మలినం చేసినట్టివారూ, ఈ జీవజ్జలోల్బణ స్ఫాటిక జలాలనుంచి కడుదూరంగా తొలగింపబడ్డవారూ అయిన వారితో వలె పరిగణింపబడతాడు.

నీవు, ఎవడి ద్వారా నీ చర్యలలో "నీవు ప్రశంసాయోగ్యుడవు" అన్న సంకేతం పైకెత్తబడ్డదో, "నీ ఆజ్ఞతో నీవు అనువర్తిస్తున్నావు" అన్న పతాకం వివృతం చేయబడ్డదో ఆయనవు. నీ సేవకులు సర్వవస్తువుల ఉత్కృష్టత నీ ఆజ్ఞావచనాల మీద ఆధారపడి ఉన్నదని, ప్రతిచర్యకూ చెందిన సద్గుణం నీ అనుమతి మహోన్నత సౌఖ్యాల మీద నియమింపబడి ఉన్నదనీ తెలుసుకునేటట్లు చేయబడటానికి, ఆ మానవ చర్యాధీనతలు నీ అంగీకార శాసనాల పరామర్శ క్రింద ఉన్నవని వారు గ్రహించగలగటానికి, ఓ నా దేవా, దీనిని నీ స్థానంగా వారికి వెల్లడించు. దేనిని గురించి "ఆత్మోత్పాదకుడవు (యేసువు) అయిన ఓ నీవా! సమస్త రాష్ట్రం నీది, " అని క్రీస్తు అశ్చర్యపడ్డాడో, "నీవు నీ సౌందర్యాన్ని అనాచ్ఛాదితం చేసినందుకూ, దేనిద్వారా నీవు తప్ప, ఇతరమంతటి నుంచి తమను విడివడజేసుకున్నవారు తప్ప ఇతరులు అందరూ శోకించారో ఆ నీ మహోన్నత నామావిష్కరణ స్థానాన్ని పొందటానికి ఏది వారిని ప్రేరేపిస్తుందో దానిని నీవు అపేక్షించిన వారికోసం వ్రాసినందుకూ, ఆ నీ నివేదితుడూ, నీ విశేషగుణ రూపప్రత్యక్షీకృతుడూ అయిన ఆయన వైపుకు వారిని నిబద్దులను చేసినందుకూ, ఓ అత్యుత్తమ ప్రియుడా! నీకు, విఖ్యాతి వర్తించుగాక అని నీ మిత్రుడు (మహమ్మదు) కేక పెడుతున్నాడో ఆ నీ సౌందర్యం నుంచి ఈ దినాలల్లో ఏదీ వారిని నివారించలేదు అన్న దీనిని వెల్లడించు.

ఓ నా ప్రభూ నీ స్థానసీమల్లో ఉపవాసాన్ని నిర్వర్తించి, నిన్ను సంతృప్తిపరచవలెననే తీవ్రతర త్వరతో నీ శాఖ అయిన ఆయనా, నీ సమాజము వారూ నిన్ననే దానిని ఆపివేశారు; నీవు ఆయనకూ, వారికీ ఆ దినాలల్లో నీ ప్రత్యక్షతను చేరినవారందరికీ నీవు నీ గ్రంథంలో శాసించే మంచినంతటినీ నియమించు. తరువాత నీవు ఈ జీవితంతోనూ, తదనంతర జీవితంలోనూ లాభకరమయ్యేదానిని వారికి చేకూర్చు.

సత్యానికి నీవు సర్వవిజ్ఞానివి, సకలవివేకివి.

Birth of the Báb

“ఈ దినమున జనియించినయట్టి, భగవంతుడు - సర్వశక్తియుతుడును, సకలప్రియుడును నగు తన పవిత్రనామ ప్రతీహారి యగునటు లొనరించిన యట్టి దివ్యుని నామము పేరిట! ”

సకలసృష్టి పైనను తన తేజమును ప్రసరింపచేసిన యొక దైవజ్యోతిచే భూమ్యాకాశములు శోభిల్లినయట్టి రాత్రికి మేముద్దేశించిన యొక దివ్యఫలకమిది.

ఓ రేయీ, ధన్యురాలవీవు! ఏలయన, నీ ద్వారా - భగవద్దినము, నామధేయ నగరవాసులకు విముక్తజ్యోతిగ యగుటకై మేముద్దేశించిన దినము, అమరత్వ క్రీడాంగణ విజేతలకు విజయ మధుకలశము, సకల సృష్టికిని హర్షోల్లాసముల సముద్భవ స్థానము - అవతరించినది.

ఏ పవిత్ర దినముచే మిధ్యాభావపు ముసువులు భగ్నము గావింపబడినదో, వ్యర్ధోహల ధూమికలు పటాపంచలు గావింప బడినవో, “స్వయం స్థితు, ” డను ఆయన నామము దృఢనిశ్చయ దిఙ్మండలముపై నుదయించినదో, అద్దానిని ఈ దివ్యదినముచే నుచ్చరింప చేసిన స్వర్లోకస్రష్ట యగు భగవంతు డత్యంత ప్రకీర్తితుడు. నీ ద్వారా అమరజీవనమను యిష్టమధువు వివృత మొనరింపబడినది, ప్రపంచజనులకు జ్ఞాన, భాషణ ద్వారములు తెరువబడినవి, సమస్త కరుణాన్వితుని మలయమారుతములు ప్రతి ప్రాంతముపైకిని వీచినవి. సకల శక్తిసమన్వితుడును, సర్వవిదుడును, సమస్త వివేకియును నగు భగవంతుని దివ్యనిధి ప్రత్యక్షమైన యట్టి ఆ ఘడియకు యెల్ల శుభములును కలుగు గాక.

ఓ భువర్లోక, సువర్లోక దివ్యగణ సంచయమా! ఏ ప్రస్తుతియును సముచితముగ సంకీర్తింపలేనట్టి, ఏ సుగుణమును వర్ణింపలేనట్టి ఆయన అవతరించిన మలిరేయికి సంకేతముగ భగవంతుడు యేర్పరచిన తొలిరేయి ఇది. రెండింటిని గురించియు పర్యాలోచించు నాతనికి శుభము వెన్నంటి యుండును. ఆతడు నిక్కముగ, వాటి యాంతరిక తత్త్వముతో అనుసంధితు డగుటకు వాటి బాహ్య వాస్తవికతను తెలిసికొనును, అవిశ్వాస మూలములు ప్రకంపితములైన యట్టి, మూఢ విశ్వాసప్రతిమలు విధ్వంసములైన యట్టి, “శక్తిసమన్వితుడును, సమున్నతుడును, సామ్యరహితుడును, సంరక్షకుడును, శౌర్యవంతుడును, అలభ్యుడును నగు ఆయన దక్క అన్యదైవము లే,” డని ఘోషించు ధ్వజపతాకము వివృతమైన యట్టి - ఈ మహదావిష్కరణమున నిక్షిప్తములైన దివ్యమర్మములాతనికి తెలియనగును.

ఈ రాత్రి యందున సామీప్యతా సుగంధము పరిమళించినది, యుగాంత సామీప్య ద్వారములు ఘల్లున వివృతములైనవి, “లోకావృత సార్వభౌమత్వముతో నరుదెంచిన సర్వనామవల్లభుడగు భగవంతునిదే దివ్యసామ్రాజ్య,” మని సమస్త సృజితాంశములును ఘోషింప నుంకించినవి. ఈ రాత్రి యందున - ఊర్ధ్వలోక దివ్యగణ సంచయము మహోన్నతుడును, మహాయశస్వియును నగు తన ప్రభుని ప్రస్తుతించినది, సర్వసమర్ధుడును, సర్వోత్కృష్టుడును నగు ఆయన చెంతకు పరువిడ చేయు సామర్ధ్యమున్న ఈ దివ్యావిష్కరణ యందు ఆద్యంతముల కధినాధుడగు ఆయనను భగవన్నామ వాస్తవికతలు కీర్తించినవి, ఇక హృదయములు పరమప్రియుని ముఖమండలము వైపున కభిముఖములైనవి, మరి తీవ్రాభీష్ట పవనములచే పత్రములు చేతనత్వమునొందినవి, ఇక సర్వస్వతంత్రుడగు ఆయన ఆమంత్రణమునకు హర్షాన్విత ప్రత్యుత్తరముగ వృక్షములు గళముల నెత్తినవి, మరి అమరవిభునితో పునస్సమాగమము నొందవలె నను ప్రగాఢవాంఛాన్వితయై భువి యెల్లయు ప్రకంపించినది, ఇంకను ఈ మహానామమునం దగుపించిన గుప్తవచనముచే సకలాంశములును నవీకృతములైనవి.

ఓ సకల వదాన్యుని రాత్రీ! మాతృగ్రంథమును మేము నీయం దవలోకింపుచున్నాము. ఇయ్యది, వాస్తవమునకు దివ్యగ్రంథమా, లేక నవ్యోద్భవ శిశువా? నా సాక్షిగా, కాదు ! భగవంతుడీ గ్రంథమును సమస్త నామముల కతీతముగ పవిత్రీకరించి యుండ, అట్టి వాక్కులు నామధేయముల ధామమునకే చెందుతవి. నిగూఢ దేవరహస్యమును, నిక్షిప్త దివ్యమర్మమును దీని ద్వారముననే వెల్లడి కాబడినవి. నా జీవితము సాక్షిగా, కాదు! మాతృగ్రంథము దీనికన్నను సర్వోన్నతమై నిలచియుండ, సమస్త ప్రస్తావితాంశములును సద్గుణ ధామమునకే చెందును. అందుండి, వాటన్నింటికిని అతీతముగ, “భగవంతుడు దక్క అన్యదైవము లే,” డను వ్యక్తీకరణలు ప్రత్యక్షములైనవి. లేదు, అట్టి యంశములు సర్వజనులకు ప్రకటీకృతములు కాగా, వాటిని నీ ప్రభుని దృష్టియం దాయన శ్రవస్సు దక్క అన్యమెద్దియును వినజాలి యుండలేదు. పరిపూర్ణ అభయ ప్రసాదితులు ధన్యులు!

అంతట, నిశ్చేష్టయై, మహోన్నతుని లేఖిని ఇట్లెలుగెత్తి పలికినది: “సమస్త నామములకన్నను సమున్నతుడవైన ఓ దివ్యమూర్తీ! నిన్ను ప్రస్తావన మొనరించుట నుండి నన్ను మినహాయింపుమని స్వర్లోక, భువర్లోకావృతమగు నీ పరాక్రమ సాక్షిగ నిన్నర్ధింపుచున్నాను, ఏలయన, నేనే నీ సృజనశక్తి ప్రయోగముచే సృష్టిలోనికి ఆవాహితనైతిని. సమస్త సృజితాంశములును వర్ణింప నశక్తత నొందినయట్టి దానిని, ఇక నేనెటుల వర్ణింపగలను? అయినను, నీ వైభవముపై ప్రమాణము చేయుచున్నాను. దేనితోనైతే నీవు నాకు స్ఫూర్తిని అనుగ్రహించినావో, అద్దానిని నేనే ప్రకటింపవలసి వచ్చెనేని, సమస్త సృష్టియు హర్షోల్లాసములనుండి దూరస్థత నొందును, మరి ఈ మహాప్రభాసమాన, మహోన్నత, మహిమాన్వితస్థలి యందలి నీ ప్రవచన సాగరగర్జనలకు అది యింకెంతగా ప్రకంపిల్లునో! ఓ ప్రభూ, తడవడు ఈ లేఖినికి అంతటి సర్వోత్కృష్ట స్థానమును శ్లాఘించుట నుండి విముక్తి నిమ్ము, ఓ నా స్వామీ, ఓ నా సార్వభౌమా, నాతో దయార్ద్రతతో వ్యవహరింపుము. మరి నేను నీ సమక్షమున గావించిన యుల్లంఘనలను సైరింపుము. నిక్కముగ, నీవు అనుగ్రహాధినాధుడవు, సమస్తశక్తియుతుడవు, నిత్యక్షమాపకుడవు, మహావదాన్యుడవు. ,”

Birth of the Báb

ఆయన అనునిత్యుడూ, ఏకైకుడూ ఏకాంతవర్తనుడూ, సకల సంపన్నుడూ, మహాప్రకీర్తితుడు.

1. ఓ నాదేవా నీవు ప్రపంచాన్ని ఉషోదయ శోభచేత అలంకరించినందున, ఎవడు నీ దివ్య సార్వభౌమత్వ ప్రత్యక్షీకరణనూ, నీ దివ్యసారప్రభాత స్రవంతినీ, నీ పరమోన్నత ప్రభుత్వావిష్కరణనూ ప్రారంభించాడో ఆతడు, ఆ ఉషోదయానంతర యామిని వేళ అవతరించినందున నీకు సకల ప్రశస్తి కలుగుగాక! ఓ స్వర్గాల స్రష్టా, నామధేయాల రూపకర్తా! నీ అనంత దాక్షిణ్యచ్ఛాయ క్రింద ఎవరు పరిరక్షింపబడినారో, ఎవరు నీ నామసంకీర్తన కొరకు తమ గొంతుకలను ప్రపంచ ప్రజల మధ్య ఎలుగెత్తి చాటారో, వారికి కృపతో సహాయపడమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.

2. ఓ నా దేవా! ఏది నీ సృష్ట్యావిష్కరణ సామ్రాజ్యాల నివాసులను మహదానందము గావించినదో ఆ నీ వదనముపై దృష్టి నిలిపి నీ నామాన్ని ఎలుగెత్తి పిలిచే సకల లోకాధిపతి తన మహాఘన కారాగారమునందు నిర్బంధింపబడటాన్ని నీవు వీక్షించుచున్నావు. ఓ నా దేవా, నీ సేవకుల కరములయందు నేను స్వయముగా బందీకృతుడనైనట్లుగా నాకు ద్యోతకమగుచున్నది. నీవు దేవుడవనీ, నీవు తప్ప అన్యదైవమెవడూ లేడన్న సత్యము నందరూ ఎరుంగుటకు సామర్థ్య మిచ్చుచూ, నీ సార్వభౌమకాంతీ, నీ అగోచర శక్త్యావిష్కరణలూ నీ వదనమునందు జాజ్జ్వల్య మానముగా ప్రకాశించుచున్నవి. బలవంతుల అధికారము నిన్ను నిరాశపరచజాలదు; పరిపాలకుల ప్రాబల్యముగానీ నీకు వ్యతిరిక్తముగా కొనసాగజాలదు. సకల సృజితములను ఆవరించినట్టి నీ సార్వభౌమేచ్ఛానుసారము ఏది నీవు ఇచ్ఛయించెదవో దానినే నీవు నిర్వర్తించెదవు. అంతియేకాక, సమస్త సృష్టినీ ఆవరించినట్టి నీ ఆదేశశక్త్యానుసారము ఏది నీవు ప్రీతిస్తావో దానిని ఆదేశిస్తావు.

3. ఎవరు నిన్ను సేవించుటకుద్యుక్తులైనారో, ఎవరు నీ ధర్మాన్ని ఆచరించారో, ఎవరు నీ ముఖకాంతి వైభవము ముందు తమను తాము వినమ్రులను గావించుకున్నారో వారిని విజయోపేతులను గావించుటకై నీ ప్రత్యక్షీకరణ వైభవానుసారమూ, మరియునూ నీ శక్త్యాధికారములచేత నీ సార్వభౌమత్వమూ, మరియునూ నీ సంకీర్తనచేత నిన్ను వేడెదను. ఓ నాదేవా, వారిని నీ శత్రువులపై విజయోపేతులను గావించు. వారిని నీ సేవయందు సుస్థిరం గావించు. నీ పరమాధికార సంకేతములు నీ రాజ్యములంతట, వారిచే స్థాపింపబడవచ్చు గాక, నీ అనితరసాధ్యశక్తి చిహ్నాలు, నీ కరములయందు ప్రత్యక్షకరింపబడు గాక. ఏది నీవు ఇచ్ఛయించెదవో దానిని వర్తించుటకు నిశ్చయముగా నీవు సమర్థుడవు; ఆపత్సహాయకుడవూ, స్వయంపోషకుడవూనైన నీవు తప్ప అన్య దైవము లేడు.

4. సర్వజ్ఞుడూ, సర్వజ్ఞాతయూ ఐన నీ ప్రభువునకు ప్రణతుల నర్పించుటకై, వినమ్రతా నివేదనతో దీనిని పఠియించుటకై ఈ వైభవోపేత ఫలకము జన్మదిన వార్షికోత్సవమున వెల్లడింపబడినది. భగవత్సేవకై నిరంతరం యత్నించు. నీ ద్వారా ఆయన వైభవోపేత మహోన్నత స్వర్గమునందు నీ స్మరణ నిత్య విరాతిజమై వర్ధిల్లుగాక!

5. ప్రవచించు: ఓ నా దేవా, నీవు కీర్తింపబడుదువుగాక! సర్వావస్థల యందు నేను నీ కారుణ్య పరిరక్షణా రజ్జువును దృఢంగా పరిగ్రహించుటకూ, నీ ఔదార్యవస్త్రాంచలమును దృఢంగా పరిగ్రహిం చేందుకు నన్ను అనుగ్రహించుటకూ, నీ సంకేతాల ఉద్గమనస్థానము సాక్షిగా, నీ విస్పష్ట సంకేతాల ఆవిష్కర్త సాక్షిగా నిన్ను వేడుకుంటాను. నిన్ను సేవించుటనుండీ, నీపట్ల భక్తి విశ్వాసము వహించి యుండుటనుండీ ఎవరిని నివారించుటకు ప్రపంచ పరివర్తనలూ మరియు సంఘటనలూ విఫల మైనవో అట్టి వారితో నన్ను పరిగణించు. అంతేకాక, నీ నామాన్ని సమున్నతం గావించడము నుండీ, నీ ప్రశస్తిని స్మరియించుకోవడమునుండీ ఎవరిని ఆటంకపరచుటకు మానవుల విఘాతము శక్తిరహితమైనదో అట్టి వారితో నన్ను పరిగణించు. ఓ నా దేవా, దేనిని నీవు ప్రేమిస్తావో, ఇచ్ఛయిస్తావో దానిని నిర్వర్తించటానికి నాకు దయతో తోడ్పడు. ఇక, నీ నామాన్ని ఏది మహోన్నతము గావించునో, ఏది నీ ప్రేమాగ్నిని జ్వలియింప జేయునో దానిని నిర్వర్తించటానికి నన్ను సమర్థుడిని గావించు.

సత్యముగా, నీవు క్షమాపకుడవు, ఔదార్యోపేతుడవు

Birth of Bahá’u’lláh

“ఆయన పరమపావనుడు, పరమోన్నతుడు, పరమోత్కృష్టుడు!”

దివ్యజన్మదిన మహోత్సవ మరుదెంచినది, భగవత్సౌందర్యుడును, సర్వశక్తిసమన్వితుడును, సమస్త ప్రేరకుడును, సకల ప్రియుడును నగు ఆయన తన భద్రాసనము నధిష్ఠించినాడు. ఈ దినమున ఆయన సాన్నిధ్యము నొందిన యట్టి, ఆపదోద్ధారకుడును, స్వయంస్థితుడును నగు భగవంతుని దృష్టి ప్రసరణకు పాత్రుడైన యట్టి యాతనికి శుభము. ప్రవచింపుడు: భూపాలకులు మాకు వ్యతిరేకముగ విజృంభిల్లిన తరుణమున, మహత్తర కారాగారమున, మేమీ యుత్సవమును నిర్వహించినారము. అయినను, పీడకుని యాధిపత్యము మమ్మెన్నటికిని అసంతృప్తుల నొనరింపనూ జాలదు, ప్రపంచ సేనానివహములు మమ్ము భీతిల్ల చేయనూ జాలవు. అందులకీ మహనీయ స్థానమున, సమస్త కరుణాన్వితుడు సాక్ష్యమును వహియింపు చున్నాడు.

ప్రవచింపుడు: ప్రపంచ జనఘోషకు దివ్యాభయసారము భీతిల్లవలెనా? లేదు, ఇంతవరకును సంస్థితమై యుండిన, ఉండవలసిన దానిపై తన తేజమును ప్రసరిల్లజేయు ఆయన దివ్యసౌందర్యము పేరిట! నిక్కముగ, సకల సృష్ట్యావృతమగు దివ్యప్రభు వైభవమిది, ఎల్ల వీక్షకుల యందునను, వీక్షిత సర్వస్వమునను నిండియున్న ఆయన మహత్తర శక్తి యిది. గుప్తితమగు ప్రతి రహస్యము పైనను తన శోభను ప్రసరించి యున్నటువంటి ఈ ప్రత్యూషమున, ఆయన సార్వభౌమశక్తి రజ్జువును బలముగ చేబూనుడు. అనన్య శాసనుడగు మీ ప్రభుని స్మరియింపుడు. ఇష్ట మధువు వివృతము కాబడినయట్టి ఈ దినమున యుగప్రాచీనుని జిహ్వ యిట్లు పల్కినది. భగవంతుని విశ్వసింపనివారి మిధ్యాభ్రమలు మిమ్ము ఆందోళనకు గురిచేయునో, లేక వారి వ్యర్ధోహలు ఈ సువిస్తారిత ప్రణాళిక నుండి మిమ్ము ప్రతిరోధించునో, జాగరూకులు కండు.

ఓ బహాజనులారా! సమస్త కరుణాళువగు మీ ప్రభుని వాత్సల్యాంతరిక్షములోనికి వైరాగ్యపు రెక్కలపై ఎగసి పొండు, మరి భద్రఫలకమునం దాదేశితమైన యటుల ఆయనకు విజయమును చేకూర్ప నుద్యమింపుడు. నా సేవకుల యందెవరి తోడనైనను మీరు తలపడుదురేమో, జాగ్రత్త. వారికి భగవంతుని సుమధుర సౌరభములను, ఆయన దివ్య భాషణములను బహూకరింపుడు. ఏలయన, వాటి శక్తిచే సకలజనులును ఆయన వైపున కభిముఖులు గావింపబడుదురు. ఈ దినమున దైవోపేక్షకులై మిగులు వారలు వాస్తవమునకు తమ వాంఛల మైకమున వివశులై, దీనిని గ్రహియింపకున్నారు. వినయ విధేయతలతో తన వదనమును తన ప్రభుని దివ్య వాక్ప్రభాతము దెసకు నిలిపినవానికి శుభమగు గాక.

ఉద్యమించి, జనులను - సర్వశక్తియుతుడును, సర్వస్వతంత్రుడును నగు వారి ప్రభుని దివ్యగ్రంథమునం దను గ్రహీతమైన దానిని పరిచయ మొనరించుట మీకు నిర్దేశితమై యున్నది. ప్రవచింపుడు: మీరు భగవద్భీతులు కండు, శంకాన్విత, అధర్మపూరిత మార్గముల యందు చరియించువారి వ్యర్ధోహలను గణియింపవలదు, సకల దివ్యనామాధిపతి యగు మీ ప్రభుని దివ్యాసనమును వికసిత హృదయములతో నాశ్రయింపుడు. సర్వశక్తి సమన్వితుడును, సకల వదాన్యుడును నగు ఆయన దక్క అన్యదైవము లేడు. మీ కన్నుల యెదుట మహాసాగరము విస్తరిల్లి యుండ, కేవల మొక సరోవరము దెసకు మీరు పరువిడెదరా? పరిపూర్ణముగ దానినే ఆశ్రయింపుడు. విశ్వాసహీనుడగు ఏ కపటి యడుగు జాడలను అనుసరింపవలదు. మా దివ్య సరసీరుహవృక్ష శాఖలపై అమరవిహంగ మవ్విధముగ ఉచ్చైస్వనమున గానము చేయుచున్నది. భగవంతుని పేరిట! ఊర్ధ్వలోక దివ్యగణ సంచయమును పరవశిల్ల జేయుటకు దాని మధురగీతికల యందొక్కటి చాలును, ఇక వాటి కతీతముగ నామధేయ నగరవాసులును, వారి కతీతులై ఉదయ, సాయం సంధ్యాసమయముల యందాయన భద్రాసన పరివేష్టకులు ఉండనే యున్నారు.

సకల దయాన్వితుడగు మీ ప్రభుని ఇచ్ఛానుసారము స్వర్గమునుండి భాషణ తుషారము లవ్విధముగ వర్షించినవి. జనులారా, వాటికి చేరువ కండు; భగవదావిష్కృత దివ్యప్రవచనములపై వ్యర్ధవాదము సల్పువారిని, ప్రామాణ్యములతో, నిరూపణములతో విభూషితుడై తమ ప్రభుడు అరుదెంచిన తరుణమున ఆయనను విశ్వసింపని వారిని - త్యజియింపుడు.

Birth of Bahá’u’lláh

“ఆయన పరమపావనుడు, పరమోత్కృష్టుడు!”

మహా ఘననామమును వహియించినయట్టి, తన యావిర్భావముతో మానవాళి దేహావయవములను ప్రకంపిత మొనరించినయట్టి, తన చరణ ధూళితో తమకొక్క ఆశీస్సు ననుగ్రహింపుమని ఊర్ధ్వలోక దివ్యగణ సంచయముచే, నామధేయ నగరముల వాసులచే అర్ధితుడైనయట్టి - ఆయన జనియించిన మాసమిది. అంతటితో వారు, భగవంతునికి ప్రణతుల నర్పించి, హర్షోల్లాసములతో ఘోషిల్లినారు. భగవంతుని పేరిట! సమస్త మాసములను తేజోమయ మొనరించినయట్టి మాసమిది, గుప్తమర్మమును, సుభద్రనిధియును నగు ఆయన - ఆవిర్భూతుడై సమస్త మానవాళి యందున ఎలుగెత్తి పిలుపునిచ్చినయట్టి మాసమిది. ఎవ్వరి మూలమున సృష్టి తలము అనంత దరహాసాన్విత యైనదో, తరువులు తూగాడినవో, సముద్రము లుప్పొంగినవో, గిరులు పరువిడినవో, స్వర్గము తన గళము నెత్తినదో, పవిత్రశిల పలవరించినదో, సమస్త వస్తువులును “ఓ సృష్టి గణ సంచయమా! దయాన్వితుడును, వాత్సల్య ప్రపూరితుడును నగు మీ ప్రభుని వదనోదయస్థలి వంకకు పరువిడు, ” డని ఘోషించినవో, అట్టి ఈ నవజాత శిశువుదే సమస్త దివ్యధామము.

సమస్త కరుణాళువగు తన దివ్యప్రభుని ముఖమండల వైభవముతో సాక్షాత్ స్వర్గమే అలంకృతమైనయట్టి, దివ్య సరసీరుహ వృక్షముపై నుండి దివ్యశకుంతము తన మధురగీతిక నాలపించినయట్టి, అనుగ్రహీతుల హృదయములు పరవశ భరితములైన యట్టి మాసమిది. కాని, అయ్యో, జనులయం దధికులు ఉదాసీనులు. ఆయనను గురుతించి, సర్వశక్తి సమన్వితుడును, సకల ప్రకీర్తితుడును నగు భగవంతుని దివ్యగ్రంథములయందు వాగ్దత్తమైన దానిని గ్రహియించిన యాతడు ధన్యత నొందును. ఊర్ధ్వలోక దివ్యగణ సంచయము తమ దృష్టిని కేంద్రీకరించినయట్టి, దుర్వర్తనుడగు ప్రతి విశ్వాసినీ నిర్జించినయట్టి ఆయనకు విముఖుడైన వానిని క్లేశమావరించును.

నీవీ దివ్యఫలకమును పరిగ్రహించుట తోడనే, సుమధుర గీతికలతో దీనిని సంకీర్తించి, ఇట్లను: ఓ నా పరమ దయాన్విత వల్లభా, నీ జ్ఞానాంబర పరిమళమును వ్యాపితమొనరించి, నీ యనుగ్రహ సాగరములను విజృంభిల్ల జేసిన యట్టి ఈ దివ్య ఫలకమున నన్ను స్మరియించి నందులకు నీకు ప్రస్తుతి కలుగు గాక. నీవు నీ ఇచ్ఛానుసారము వ్యవహరింపగల శక్తిశాలివని నేను సాక్ష్యము వహియింతును. సర్వశక్తిసమన్వితుడవు, సర్వజ్ఞుడవు, సకల వివేకివి యగు నీవు దక్క అన్యదైవము లేడు.

Birth of Bahá’u’lláh

జనన ఫలకము

(లాహ్-ఇ-మౌలూద్)

1. ఓ దృశ్యాదృశ్య సమూహమా! అమితానందముతో మీ హృదయ సీమలయందు ఆహ్లాదించండి. ఏలయన, యుగయుగాల మరియునూ గత కాలచక్రముల ఫలసమీకరణలు జరిగిన రాత్రి అరుదెంచినది. సమస్త దివారాత్రము లెందున అస్తిత్వములోనికి ఆహ్వానింపబడినవో, ఎవడు శక్త్యాధికార ప్రభువో, ఆతడి ఆదేశానుసారము ఈ ఆవిష్కరణకై పూర్వాదేశిత సమయం ఆసన్న మైనదో, అట్టి రాత్రి అరుదెంచినది. ఒక మహావైభవోపేత మహోద్భుత ఆత్మ సాక్షాత్కారమైనందులకు సమున్నతశ్రేణికి సకల సంతోషము కలుగుగాక!

2. ఇది స్వర్గద్వారములు విస్తారముగా వివృతము గావింపబడి, నరకద్వారములు వేగంగా అనావృతము గావింపబడిన రాత్రి; ఇది సృష్టి హృదయాంతరాళమునందు సకల కరుణాన్వితుడి స్వర్గము అనాచ్ఛాదిత మొనరింపబడిన రాత్రి. భగవానుడి మంద పవనాలు క్షమాశ్రయములనుండి వీచబడినవి. సత్యశక్తి చేత అంతిమ ఘడియ ప్రవేశపెట్టబడినది. ఇది మీరు తప్పక గ్రహియించ గలరు. సకల సంతోషాలు ఈ మహారాత్రివే; తద్వారా సకల దినములునూ కాంతిమయం గావింప బడినవి. ఎవరు వాస్తవికతా వివేకాలచేత అనుగ్రహింపబడినారో వారు తప్ప అన్యులెవరూ దీనిని గ్రహియింపజాలరు.

3. శక్తిసమన్విత రాత్రములు దేనిచుట్టూ పరిభ్రమించినవో, ఎచట దేవకన్యలు మరియూ దివ్యాత్మ, స్వర్గప్రవాహములతో పూరింపబడిన చషకములను గైకొని క్రిందికి ఏతెంచెనో, ఎచట శక్తిమంతుడూ సకల ఔదార్యుడూ, మహావదాన్యుడూనైన దైవాభరణము చేత స్వర్గము స్వీయాలంకరణ గావించుకున్నదో, ఎచట ప్రతి సృజిత వస్తువునకు జీవము ప్రసాదింపబడినదో, ఎచట సమస్త భూమండలవాసులు ఆయన కారుణ్యముచేత ఆవరింపబడిరో అట్టి శుభరాత్రి ఇదియే. ఈ విస్పష్టోజ్వల వదాన్యత వలన ఆత్మీయ సమూహమునకు సకల సంతోషము కలుగుగాక!

4. దివ్యావిష్కరణోదయము ప్రారంభమై ఏది వైభవ మహనీయతల నేత్రములను సాంత్వన మొనరించినదో అది సాక్షాత్కరించినందున, అంతకుమించి అధికముగా, ఏది సకల దైవప్రవక్తల మరియు దైవవార్తావహుల నేత్రములను సైతం సాంత్వనమొనరించినదో అట్టి దివ్యావిష్కరణోదయము ప్రారంభమైనందున, ఇది, జిబ్ట్1 యెుక్క అవయవములు ప్రకంపనకు గురిచేయబడిన రాత్రి; మహాఘన విగ్రహము నేలకూలిన రాత్రి; అధర్మ పునాదులు విధ్వంసము గావింపబడిన రాత్రి. అంతేకాదు మనాత్2 తన హృదయాంతరాళమునందు విలపించిన రాత్రి. ఉజ్జా3 వెన్ను విరిచివేయబడి, దాని ముఖము వివర్ణము గావింపబడిన రాత్రి. ఇక, ఈ ప్రకాశమాన వైభవారుణోదయ క్షితిజముపై విరాజిల్లినట్టి ఈ ఉషస్సునకు సకల కీర్తి వర్ధిల్లుగాక!

5. ప్రవచించు: ఇది దురాత్ములు శక్తివైభవాల సామ్రాజ్యమును సమీపించకుండా అడ్డగింపబడిన అరుణోదయం. ఇది, శక్తిమంతుడూ, సకల వైభవోపేతుడూ, అనిర్బంధనుడూయైన దేవదేవు నెదిరించినవారి హృదయములు చీల్చివేయబడినట్టి ఉషోదయము. ఇది, ఎవడి ఆగమనాన్ని సకల దృశ్యాదృశ్య వస్తువులూ, వాటిపైనున్న అత్యున్నత సమూహమూ ఆసక్తితో నిరీక్షించిరో అట్టి ఈ సౌందర్యకాంతితో, ధర్మాత్ముల వదనము లొకవైపు ప్రకాశించుచుండ, మరియొక వైపు దుర్మార్గుల వదనములు మ్లానము కావింపబడినట్టి అరుణోదయం. ఎవడి శక్తి ద్వారా మృతులు తమ సమాధుల నుండి చేతనులుగావింపబడిరో, కృశించిన ప్రతి అస్థిక యందు జీవము నింపబడినదో అట్టి ఈ పవిత్రాత్మ సాక్షాత్కారమును అందరూ ఆహ్వానింతురుగాక!

6. ప్రవచించు: ఓ అధర్మ మూలమా! నీ దుఃఖపూరిత ప్రయాణానికి రోదించు. ఓ విరోధమూలమా! సకల కారుణ్యమూర్తి సౌందర్యము, తన సామ్రాజ్యముల యందు నివసించెడివారి నందరినీ తన కాంతివైభవము చేత ప్రకాశవంతము గావించునట్లుగా అస్తిత్వ క్షితిజముపై ప్రకాశించినందున, శక్తిమంతుడూ, సర్వవైభవోపేతుడూ, మహాఔదార్యుడూ అయిన భగవదాత్మను అస్తిత్వములోనికి ఆహ్వానించినందున నీ హృదయసీమను అంతరాగ్నియందు పునర్‌వ్యవస్థీకరించు. దాని ఆవిష్కరణ ద్వారా ఆయన ఇచ్ఛాహస్తము వైభవ-వస్త్రము చేతనూ, అసమానమూ, సకల నిర్బంధమూ, మహోన్నతమూనైన తన సార్వభౌమత్వం చేతనూ ప్రపంచ ఆచ్ఛాదనలను ఛిన్నా భిన్నము చేసినది. ఎచ్చట శక్తిమంతుడూ, మహాఘనుడూనైన ఆతడి నామధేయాసనముపైన ప్రాచీన సౌందర్యుడు అధిష్ఠింపబడినాడో అట్టి మహోదయమునకు సకలకీర్తి వర్ధిల్లుగాక!

7. సృష్టించనివాడూ, సృష్టించబడనివాడూ నైన ఆతడు ఎచట ఉదయించెనో అట్టి ఉషోదయము ఇదియే. ఈ ప్రపంచమునందు ఉప్పొంగెడి ఆంతరిక మర్మసాగరపు టగాధమునందు తనను తాను నిమగ్నము గావించుకునే వాడికి రాజన్యుడూ, ప్రకీర్తితుడూ, శక్తిమంతుడూ, బలయుతుడూ అయిన భగవంతుని ప్రవచనమునందు దాగియున్న విజ్ఞానవివేకము లనెడి మౌక్తికములను కనుగొన్నవాడికి శుభమగును. ఎవడు ఈ సత్యమును గ్రహియించునో అట్టివాడికి యశస్సు కలుగు గాక. అంతేకాక, వివేకానుగ్రహాన్ని పొందిన వాడిగా పరిగణింపబడుగాక!

8. ప్రవచించు: ఎచట స్వర్గసమాజ పటాలములూ, పావన దేవతల ఆతిధేయులూ స్వర్గము నుండి అరుదెంచిరో అట్టి శుభోదయ మిదియే; ఎవడు మహావైభవోపేతుడైన భగవత్సౌందర్యుడి పవనములపైన మహాఘన సమూహ స్థానములకు అతీతముగా ఊర్ధ్వీకృతము గావింపబడెనో ఆతడు వారి మధ్యనే ఉండెను. ఎచట ప్రాచీనాస్తిత్వము తన సకల వైభవోపేత మహావదాన్యతానామ సింహాసనముపై తనను తాను సుస్థాపితము గావించుకొనెనో ఆ పావనప్రదేశము చుట్టూ భక్తితో ప్రదక్షణ గావించెడివారికి సమర్పించుటకై, శాశ్వత జీవన్మధువును కరమున దాల్చిన మరియొక దేవతాగణము, ఈ పవనములపైనే ఉదయించెను. ఆతడి సాన్నిధ్యము నొంది, ఆతడి సౌందర్యాన్ని వీక్షించి, ఆతడి స్వరమాధుర్యాలను ఆలకించినట్టి వారికి, ఆతడి పావనప్రకీర్తితములూ మరియు వైభవోపేత ప్రకాశమాన అ ధరముల నుండి జాలు వారిన పదముచేత, చేతన గావింపబడినవారికి సకల ఆనందము కలుగుగాక!

9. ప్రవచించు: ఇది మహాఘనతరువు నాటబడి, అది తన మహోన్నత అసమాన ఫలములను ప్రసాదించిన శుభోదయము. భగవంతుని ధార్మికత్వము మీద ప్రమాణము! ఈ తరువుకు చెందిన ప్రతీ ఫలము నందు దశ సహస్ర స్వరరాగముల బీజములు విశ్రమించును. అందుచేత ఓ దివ్యాత్మ సమాజమా, మేము మీ సామర్థ్యము మేరకు వాటి పవిత్రగీతములను కొన్నిటిని మీకు పరిచయము గావించెదము; తద్వారా అవి మీ హృదయములను ఆకర్షించవచ్చును, బలాధికారశక్తులకు అధిపతియైన భగవంతుడికి చేరువ గావించవచ్చును. దేని ద్వారా శక్తిమంతుడూ, అసాధ్యుడూ, మహోన్నతుడూ అయిన భగవంతుని ఆదేశానుసారము దివ్యజ్యోతులు పవిత్రతా క్షితిజముపైన శోభించినవో అట్టి శుభోదయమునకు యశస్సు కలుగుగాక!

10. ప్రవచించు: ఎచట నిగూఢసారమూ, అదృశ్యని ధీ ప్రత్యక్షీకరింపబడినవో అట్టి శుభోదయము ఇదియే. ఎచట ప్రాచీన సౌందర్యుడు అమృతచషకమును కీర్తిహస్తములతో పరిగ్రహించి, అటుపిమ్మట అందుండి ప్రప్రథమముగా పానము చేసి, అటుపిమ్మట ఉన్నతులకూ, సామాన్యులకూ సమస్త భూప్రజలందరికీ ఒకే రీతిగా సమర్పించినట్టి శుభోదయము ఇదియే. అందుచేత, ఎవడైతే ఈ చషకమును సమీపించి, దానిని పరిగ్రహించి, సకల బలవంతుడూ, మహోన్నతుడూ అయిన అతడి ప్రభువు ప్రేమకొరకు దానిని పానం చేస్తాడో అట్టి వాడికి సకల యశస్సు కలుగుగాక!

11. గత కాలములో జ్వలనగుల్మము ఏదైతే ప్రకటించినదో, ఏ ప్రవచనములకు మోజెస్ తన కర్ణము నొగ్గెనో, ఏది సమస్త సృజితములను పరిత్యజించుటకూ, పవిత్రమూ వైభవోపేతమూ అయిన నిర్ణయముల వైపు అడుగులు వేయుటకూ ఆతడిని ప్రేరేపించినదో ఆ తరుఫలమొకటి ఆ పావన హిమవర్ణ ప్రదేశమునందు ప్రకటించినది. ఇక మహాశక్తివంతుడూ, మహాప్రకీర్తితుడూ, మహోన్నతుడూ అయిన భగవంతుడి నుండి ప్రభవించిన పరమానందమునకు సకల యశస్సు కలుగుగాక!

12. ఏది జీసస్‌ను మహదానందము గావించి, అయన విస్పష్టవైభవ స్వర్గమునకు ఊర్ధ్వీకృతుడిని గావించినదో దానిని, అదే తరువున కాసిన ఫలమొకటి ప్రకటించినది. ఇక ఎవరి సాన్నిధ్యము నందు విశ్వాసాత్మ దేవుడు ఎంపిక చేసుకున్న దేవకన్యల సమూహముతో కలిసి నిలిచియున్నదో ఆ దివ్యాత్మకూ సకల యశస్సు కలుగుగాక!

13. ఆ తరువున కాసిన మరియొక ఫలము, పావనమూ, ప్రకీర్తితమూ, శక్తిమంతమూ అయిన నా నామమర్మాన్ని ప్రకటించే దైవవాణి, మహిమాన్విత పటవేశ్మమునుండి ముందుకుసాగి, దివ్య శాశ్వతవృక్షమువైపు ఊర్ధీకృతమొంది, మహోన్నతి నుండి వినిపించిన కంఠధ్వని మధుర స్వరములచేత సమ్మాహితుడైనట్టి దైవవార్తావహుడైన మహమ్మదు హృదయాన్ని బంధించిన దానిని వెల్లడించినది. సత్యశక్తి ద్వారా పరిపోషింపబడినదీ, సమస్త ప్రపంచప్రజలు దాని ఛాయ క్రింది రక్షణ ప్రసాదించగలిగినదీ అయిన ఈ పావన వృక్షమునకు ఇక యశస్సు కలుగుగాక!

14. ఓ మహోన్నత లేఖినీ, ఇంకేమియూ రచియింపవలదు, ఏలయన దివ్య వృక్ష ఫలముల సమస్త మధురస్వరాలను గనుక నీ ముందు వెల్లడింప జేసినచో, నిన్ను నీవు భూమిపైన త్యజింపబడిన వాడివిగా భావించెదవు, ఏందుకంటే అందరూ నీ దగ్గర నుండి తిరోగమింతురు, నీ పవిత్ర స్థానమును వదలివేయుదురు. నిశ్చయముగా, ఇదియే నిస్సందేహ సత్యము. సకల పరిపాలకుడూ, శక్తివంతుడూ, మహాఔదార్యోపేతుడూ అయిన దేవుడు తప్ప అన్యుడెవడూ భరియింపలేని మర్మములకు సకల యశస్సు కలుగు గాక!

15. ఓ లేఖినీ, పుడమి యంతటా నయవంచకులు ఎట్టి కోలాహలమును ఉత్పన్నం గావించిరో, అదే రీతిగా దుర్మార్గులూ, నాస్తికులూ, ఎట్టి కోలాహలమును ప్రేరేపించిరో నీవు వీక్షించవా? ఇది జరిగినప్పటికినీ, మహాప్రకీర్తితుడూ సర్వవైభవోపేతుడూ అయిన నీ ప్రభుమర్మములకు చెందిన అతి సూక్ష్మకాంతిని మాత్రమే నీవు వెల్లడించితివి. అందుచేత, నిన్ను నీవు నిగ్రహించుకొని ఆతడి వదాన్యతా చిహ్నముగా ఏది భగవంతుడు నీకు అనుగ్రహించాడో దానిని మానవుల నేత్రాల నుండి మరుగు పరుచుకొనుము. అదియునుగాక, సకలసృజితములను ప్రసాదించడమన్నది నీ ఇచ్ఛ యైనచో, నిక్కముగా ప్రాణప్రదమైన ఆ స్వచ్ఛజలమునుండి పానము చేయుటకు భగవంతుడు నిన్ను దాని మహోల్బణ మూలమును గావించినాడు, కావున వారి సామర్థ్యమునకు అనుగుణముగా మాత్రమే నీ రచనను సాగించుము. ఎవడైతే నిన్ను తన ఆదేశాధికారము ద్వారా అస్తిత్వములోనికి తెచ్చెనో ఆతడు ఈ విధముగా నిన్ను ఆజ్ఞాపించాడు. కావున, నీవు ఆదేశింపబడిన రీతిగనే నీవు వర్తించు, ఆలసించెడి వారిలో వాడివి కావలదు. ఏది సకల సృజితముల అధికారము యందు ఆజ్ఞాపింపబడి ప్రపంచప్రజలను ఆచ్ఛాదితము గావించినదో, దేనిని ప్రపంచప్రజలకు వెల్లడించుట నుండి మహోన్నతుడి లేఖిని నిలిపివేసినదో అట్టి గురుతర శాసనమునకు సకల యశస్సు కలుగు గాక! నిశ్చయముగా ఆయన శక్తి సమస్తసృజితములకు సమానమైనది.

Birth of Bahá’u’lláh

ఆయన దేవుడు

1. ఓ ప్రగాఢ ప్రేమికా సమాజమా! భగవంతుడి ధార్మికత మీద ప్రమాణము, సృజితప్రపంచము ఎన్నడూ దర్శించనట్టి ఒక అద్భుత రాత్రి ఇది. నిక్కముగా, సకల వైభవోపేతుడూ, మహోఔదార్యో పేతుడూ అయిన భగవంతుడి అనుగ్రహమునుండి ప్రాప్తించినది.

2. ఓ అత్యున్నత సమాజమా, 'మీ స్వర్గాశ్రయముల యందు ఆనందించండి' అని ప్రకటిస్తూ దివ్యాత్మ ఉదాత్తస్వరముతో ఆలపించే ఒక రాగము సకలమానవుల వాస్తవికతలను సంక్షోభము నందు విసిరివేసిన శుభరాత్రి ఇదియే.

3. అటుపిమ్మట, దైవవాణి పవిత్రతా వదాన్యతల పటవేశ్మమునందు ఇలా ఎలుగెత్తి చాటినది, ఎవడు సకల దయాన్వితుడి వాస్తవికతయో ఆతడు నిక్కముగా ఉదయించిన శుభరాత్రి ఇదియే. ఎచ్చట ప్రతి శాశ్వత శాసనము సకల వైభవోపేతుడి లేఖినిచేత విపులీకరింపబడినదో అట్టి రాత్రీ ఇదియే. ఓ బయాన్ సమూహమా; ఇక అమితానందముతో ఆనందించండి!

4. "ఓ స్వర్గ నివాసులారా, ఆనందించండి," అంటూ ఎచట మార్మిక కపోతము స్వర్గతరుశాఖలపైన తన గళమునత్తినదో, ఆ రాత్రి ఇదియే.

5. ప్రవచించు: ఎచ్చట వైభవాచ్ఛాదనలు వాస్తవికతా ప్రజల కట్టెదుట ఖండింపబడినవో అట్టి రాత్రి ఇదియే, అదేరీతిగా, స్వర్గవిహంగము తన సుస్వరమును శాశ్వతసామ్రాజ్య హృదయాంతరాళము నందు గానముచేసినదీ ఈ రాత్రియే. ఓ శాశ్వత నగరమునందలి పవిత్రతా స్వరూపులారా ఇక ఆనందించండి.

6. ఎచ్చట దేవుడు ఆతడి మహోన్నత నామములను, ప్రకాశములను సకల దిశలకు వ్యాపింపచేసి పవిత్రమూ తేజోయుతమూ అయిన ప్రతి ఒక్కడి హృదయ సింహాసనమునందు తనను తాను ప్రతిష్టించుకున్నాడో అట్టి రాత్రి ఇదియే ఓ బయాన్ సమూహమా, ఇక ఆనందించండి!

7. ఎచ్చట క్షమాసముద్రము ఉప్పొంగి, దాని సంరక్షణాపవనములు అన్యప్రదేశమంతటా విస్తరింప బడినవో అట్టి రాత్రి ఇదియే. ఓ సకల దయాన్వితుడి సమూహములారా, ఇక ఆనందించండి!

8. ఎచ్చట భూమిపై వసియించెడి వారందరి అతిక్రమణలు క్షమియింపబడినవో అట్టి రాత్రి ఇదియే. ఈ నశ్వర ప్రపంచమునందు సృజియింపబడిన వారందరికినీ, ఇది నిక్కముగా ఒక ఆనందకర వార్త!

9. ప్రవచించు: ఎచ్చట వదాన్యతానుగ్రహ నిర్ణయపరిమాణములు బలవిశ్వాసములనెడి పుటలపైన లిఖింపబడినవో అట్టి శుభరాత్రి ఇదియే. తద్వారా ప్రతి విషాదఛాయ శాశ్వతముగా సకలసృజితముల నుండి బహిష్కరింపబడవచ్చును. ఆస్తిత్వసామ్రాజ్యమునందు అడుగిడిన ఓ ప్రజలారా! ఇక ఆనందించండి.

10. ఇది, నిశ్చయముగా సకల వైభవోపేతుడూ, మహాఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము ద్వారా వచ్చినదని ఈ క్షణమున విశిష్టతా ప్రశస్తికి ఆలవాలమైన శాశ్వత హృదయాంతరాళము నుండి ఆత్మాగ్రగామి ఘోషించుచున్నాడు.

11. భగవంతుని మీద ప్రమాణము! ఎవడు సార్వభౌత్వాధికారములకు మూలమో ఆతడి శక్తియుత హస్తము చేత కస్తూరి పరిమళద్రాక్షాసవము వివృతము గావింపబడినదని వచియించుచున్నాడను. ఇక, ఇది నిశ్చయముగా మహాప్రకీర్తితుడూ, మహాఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము వలన సంభవించినది.

12. సకల వైభవోపేతుడి కొరకై దివ్యజోసెఫ్‌చేత రక్తవర్ణ ద్రాక్షాసవచషకములు అన్నివైపులా పరిగ్రహింపబడినవి. ఇక, ఇది నిశ్చయముగా, మహాప్రకీర్తితుడూ, మహాఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము వలన సంభవించినది.

13. ఓ మానవ సమాజమా! ఇక త్వరపడండి, ఈ శాశ్వత జీవస్రవంతి నుండి మీ భాగాన్ని పానము చేయండి. ఇక, ఇది నిశ్చయముగా, మహాప్రకీర్తితుడూ, మహాఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము వలన సంభవించినది.

14. వచించు: ఓ సత్యప్రేమికుల సమాజమా! అపేక్షితుడి సౌందర్యము దాని విస్పష్ట వైభవముతో వెలుగొందినది. ఇక, ఇది నిశ్చయముగా మహాప్రకీర్తితుడూ, మహోఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము వలన సంభవించినది.

15. ఓయీ, ఆతడి ప్రేమస్వరూపులారా! పవిత్రతాక్షతిజముపైన పరమప్రియుడి వదనము ఉదయించినది. ఓ బయాన్ ప్రజలారా! మిమ్మల్ని మీరు త్వరపెట్టుకొని మీ సమస్త హృదయములతో దాని వంకకు వేగిరపడుడు. ఇక ఇది, నిశ్చయముగా మహాప్రకీర్తితుడూ, మహాఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము వలన సంభవించినది.

16. నిదర్శనము నెరవేర్చబడినది, సాక్ష్యము స్థాపింపబడినది, ఏలయన నిత్యనివాసియైన ఆతడి స్వీయప్రత్యక్షత యందలి దైవదర్శనము ద్వారా పునరుత్థానము జరిగిపోయినది. ఇక, ఇది నిశ్చయముగా మహాప్రకీర్తితుడూ మహోఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము వలన సంభవించినది.

17. యుగాలు గతించినవి, కాలచక్రములు వేగవంతము గావింపబడినవి, అంతేకాదు, ప్రతి జ్ఞాని ఆనందముతో వెలుగొందినాడు. ఏలయన, భగవంతుడు ఆయన కీర్తివైభవాన్ని, పచ్చని చిగుళ్లతో అలంకరించిన ప్రతి వృక్షముపైన ప్రసరించాడు. ఇక, ఇది, నిశ్చయముగా, మహాప్రకీర్తితుడూ మహాఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము వలన సంభవించినది.

18. ఓ భగవత్సంచయమా! మిమ్మల్ని మీరు త్వరపెట్టుకొనండి, ఏలయన ఆత్మలు ఏకీకృతము గావింపబడినవి, దివ్యపవనములు వ్యాపించినవి, నశ్వరకల్పనలు తొలగింపబడినవి, అంతేకాదు శాశ్వత స్వరములు ప్రతి సుప్రతిష్టిత వృక్షము నుండి మారుమ్రోగినవి. ఇక, ఇది, నిశ్చయముగా, మహాప్రకీర్తితుడూ, మహోఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము వలన సంభవించినది.

19. దేవుడి మీద ప్రమాణము! ఆచ్ఛాదనలు దూరముగా దహించివేయబడినవి; మేఘాలు ఛిన్నాభిన్నము గావింపబడినవి, చిహ్నాలు వెల్లడింపబడినవి; ఎవడి శక్తి సమస్తవస్తువులకు సమానమైనదో ఆతడి చేత పూర్వసూచనలు విస్పష్టము గావింపబడినవి. ఇక, ఇది నిశ్చయముగా, మహాప్రకీర్తితుడూ, మహోఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము వలన సంభవించినది.

20. మీ హృదయములను ఆనందముతో పూరింపనిండు, అయితే, ఈ అతి సమీపము నుండి రక్షింపబడినట్టి అత్యంత నిగూఢమర్మమును దాచివుంచు. లేనియెడల, ఉల్లాసానందములను అనుగ్రహించే ఏ ద్రాక్షాసవమును మీరు పానము చేసితిరో దానిని ఆగంతకుడు తెలుసుకుంటాడు. ఇక, ఇది నిశ్చయముగా, మహాప్రకీర్తితుడూ, మహోఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము వలన సంభవించినది.

21. ఓ బయాన్ సమాజమా! భగవంతుడే నాకు సాక్ష్యము వహిస్తాడు. ఆయన అనుగ్రహము సంపూర్ణమైనది, ఆయన దాక్షిణ్యము పరిపూర్ణమైనది; అంతేకాదు, ఆయన వదనము ఆనందప్రకాశము చేత వెలుగొందుచున్నది. ఇక ఇది, నిశ్చయముగా మహాప్రకీర్తితుడూ, మహాఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహమున సంభవించినది.

22. ఓ నా సహచరులారా! ప్రకాశమానమూ, తేజోమయమూ అయిన ఈ స్రవంతి నుండి మీ భాగాన్ని పానము చేసి దానియందే ఆనందించండి. ఓ నా స్నేహితులారా! ఇక, ఇది, నిశ్చయముగా, మహాప్రకీర్తితుడూ, మహోఔదార్యోపేతుడూ అయిన భగవంతుని అనుగ్రహము వలన సంభవించినది.

Bahá'u'lláh

Windows / Mac